=====================================================================
షుగర్ కంప్లీట్ గా తగడానికి ఔషధం
========================================================================
SHIFA ULLAH
NURSING HOME AND OLD AGE HOME
========================================================================
========================================================================
వాంతులు తగ్గుటకు
* వాంతులు బాగా అయ్యేప్పుడు లేత కొబ్బరినీరు త్రాగితే అవి నిశ్చయముగా ఆగిపోవును .
* తుంగముస్తలు , శృంగి , పిప్పళ్లు సమభాగాలుగా తెచ్చి చూర్ణము చేసుకుని తేనెతో సేవించుచున్న వాంతులు కట్టును .
* నిమ్మకాయ రసంలో తినేసోడా వేసి పొంగువచ్చిన వెంటనే త్రాగిన వాంతులు కట్టును .
* వెలగాకు రసం తాగిన వాంతి కట్టును .
* శొంఠి , నేలతాడి సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి కలుపుకుని ఆ చూర్ణం లోపలికి తీసుకొనుచున్న వాంతులు కట్టును .
* వాము , ధనియాలు , జీలకర్ర సమాన భాగాలుగా తీసుకుని వేయించి ఆ చూర్ణం కషాయంలా కాచి తీసుకొనుచున్న వాంతులు తగ్గును.
* పుదీనా ఆకులు పచ్చడిగా చేసి తింటున్నా వాంతులు తగ్గును. వాంతి వస్తున్న సమయంలో కొంచం నోటిలో వేసుకొనుచున్న వాంతి తగ్గును.
* నోట్లొ కొంచం దాల్చినచెక్క ముక్క వేసుకొని రసం మింగుచున్న వాంతులు తగ్గును.
* జీలకర్ర నమిలి మింగుచున్న వాంతులు తగ్గును.
* పూటకి ఒక మారేడు పండు తినుచున్న వాంతులు త్వరగా తగ్గును.ప్రతిరోజూ ఈ ఔషదం తో పాటు బార్లీ గింజల నీటిని కూడా తాగడం వలన ఇంకా తొందరంగా మీ సమస్య నుంచి బయటపడతారు.
========================================================================================
మజ్జిగ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు పెరుగు , నీరు సమాన పాళ్ళలో కలిపి చిలికి తయారుచేసిన మజ్జిగ తేలికగా ఉండి శీఘ్రముగా జీర్ణం అగును. కొంచెం వగరును , పులుపును కలిగి ఉండును. జఠరాగ్నిని వృద్దిచెందించును. కఫవాతాలను హరించును . శోఫరోగం , ఉదరం , మొలలరోగం , బంక విరేచనాలు , మూత్రబంధం , నోరు రుచిని కోల్పోవుట , స్ప్లీన్ పెరుగుట, గుల్మం , అధికంగా నెయ్యి తాగుట వలన కలుగు సమస్య , విషము , పాండురోగం వంటి సమస్యలను నివారించును.
మజ్జిగలో కూడా రకాలు కలవు. ఇప్పుడు ఆ రకాలను మీకు వివరిస్తాను. పెరుగుకు నీళ్లు కలపకుండా కేవలం పెరుగును మాత్రం చిలికి చేయబడిన మజ్జిగని "గోళ " అని అంటారు. పెరుగుకు నాలుగోవ వంతు నీరు కలిపి కవ్వముతో చిలికి చేయబడిన మజ్జిగని "ఉదశ్విత" అనబడును. సగం భాగం నీరు కలిపి పెరుగును చిలికి చేయబడిన మజ్జిగని " తక్రము " అని పిలుస్తారు . పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేయబడిన మజ్జిగని "కాలశేయ" అని పిలుస్తారు . వీటన్నింటిలో సగం పెరుగు , సగం నీరు కలిపి చేసిన తక్రము అని పిలిచే మజ్జిగ బహు శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు తక్రము యొక్క విశేష గుణాలు గురించి వివరిస్తాను .
తక్రమను మజ్జిగని వాడుట వలన శరీరం నందు జఠరాగ్నిని వృద్దిచెందించును. వాంతి , ప్రమేహము , వాపు , భగంధరం , విషము , ఉదరరోగము , కామెర్లు , కఫము , వాతాన్ని హరించును .
వెన్నపూర్తిగా తీయని మజ్జిగను మందజాతం అని పిలుస్తారు . ఇది అంత తొందరగా జీర్ణం అవ్వదు . జిడ్డు కొంచం కూడా లేకుండా చిలకబడిన మజ్జిగని అతిజాతం అనబడును. ఇది మిక్కిలి పులుపుగా ఉండి ఉష్ణాన్ని కలుగచేయును. దప్పికను పెంచును. వగరు , పులుపు రుచుల కలిసిన మజ్జిగ మలబద్దకం కలుగచేయును . కేవలం పుల్లగా ఉండు మజ్జిగ మలాన్ని బయటకి పంపును . ఏమి కలపకుండా ఉండు చప్పటి మజ్జిగ ఉదరం నందు ఉండు కఫాన్ని హరించును . కాని కంఠము నందు కఫాన్ని కలిగించును.
మజ్జిగని ఉపయోగించకూడని సమయాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. గాయాలు తగిలినప్పుడు , మూర్చరోగము నందు , భ్రమ , రక్తపిత్త రోగము నందు తక్రమను మజ్జిగ వాడరాదు. అదే విధముగా మంచు కాలం నందు , శరీరంలో జఠరాగ్ని మందగించి ఉన్నప్పుడు , కఫముచే జనించిన రోగముల యందు , కంఠనాళం సమస్య యందు , వాతం ప్రకోపించినప్పుడు తక్రము అను మజ్జిగని ఉపయోగించవలెను .
శరీరం నందు వాతము ప్రకోపించినప్పుడు పులిసిన మజ్జిగని సైన్ధవ లవణము కలిపి తాగవలెను . పిత్తము ప్రకోపించినప్పుడు తీపిగల మజ్జిగ పంచదార కలిపి తాగవలెను. అదేవిధముగా శరీరము నందు కఫము ప్రకోపించినప్పుడు త్రికటుకముల చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన చూర్ణం మరియు ఉప్పు కలిపిన మజ్జిగ తాగవలెను.
కొంచెం పుల్లగా ఉండు మజ్జిగ శుక్రవృద్ధికరం , మిక్కిలి పులుపు కలిగిన మజ్జిగ జఠరాగ్ని వృద్దిచేయును . పీనసరోగం అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం , శ్వాస , రొప్పు వంటి రోగాలు ఉన్నప్పుడు మజ్జిగని కాచి తాగవలెను . శరీరంపైన వ్రణాలు లేచినప్పుడు మజ్జిగ వాడినచో అనేక సమస్యలు వచ్చును. మజ్జిగకు ద్రవాన్ని శోషించుకొనే గుణం ఉండటం వలన నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మజ్జిగ ఇవ్వడం వలన నీటిని గుంజి మలమును గట్టిపడచేయును అందువల్ల విరేచనాలు తగ్గును. గేదె మజ్జిగ కామెర్ల రోగము నందు , పాండు రోగము నందు అద్భుతముగా పనిచేయును . మేకల మజ్జిగ , గొర్రెల మజ్జిగ , చెడ్డవాసన కలిగిన మజ్జిగ త్రిదోషాలను పెంచును. కావున వాడరాదు.
మనుష్యల రోగాలకు ప్రధానకారణం మనం తీసుకునే ఆహారం . మనయొక్క శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని మనం తీసుకున్నంతవరకు మనకి సమస్య ఉండదు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి . ఈ మధ్యకాలంలో నాదగ్గరకు వస్తున్న రోగులలో చాలావరకు ఆహారసంబంధ రోగాల వారు ఎక్కువగా వస్తుండటం గమనించాను. అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక ప్రధాన సూక్తి కలదు. " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని గొప్ప విషయం అంతర్లీనంగా చెప్పబడింది. కావున మీ శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడవద్దు.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల - 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి .
సంప్రదించవలసిన నెంబర్ :- 9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
========================================================================
No comments:
Post a Comment